సినిమాల్లో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే కొత్త నటీనటులు, కొత్త టెక్నిషియన్స్ వస్తుంటేనే పరిశ్రమలో కొత్త కాన్సెప్ట్స్ వస్తుంటాయి. ఇది బలంగా నమ్మిన దర్శకుడు పాలిక్. ఎంతోమందిని పరిచయం చేసిన దర్శకులు పాలిక్ . వారి దర్శకత్వంలో బిఎస్‌ఆర్‌కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం సెప్టెంబర్ 11 న ప్రారంభమైంది. ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపకుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేయగా, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. నటుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ఉంటాయి. మిత్రుడు సుధాకర్ గారితో కలిసి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నానన్నారు నిర్మాత రావుల రమేష్.
ములుగు , వరంగల్ , అరకు ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసారు మేకర్స్.
క్రియేటివిటీ, కన్విక్షన్, కాన్ఫిడెన్స్ , కామన్ సెన్స్ ఇలా నాలుగు `సి`లు ఉన్న వ్యక్తి దర్శకుడు పాలిక్ అన్నారు శ్రీ తోటపల్లి సాయినాథ్.
నిర్మాతే నాకు దేవుడు. కరోన సమయంలో ఎలాంటి అవకాశాలు లేని సమయంలో రావుల రమేష్ గారు నాతో ` రౌద్ర రూపాయ నమః`సినిమా నిర్మించారు. అది చాలా బాగొచ్చింది. ఇది రెండో సినిమా. నా మీద , నా కథ మీద నమ్మకంతో అవకాశం కల్పించారన్నారు దర్శకుడు పాలిక్.
1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథకు ఆధారంగా తెరకెక్కించే పీరియాడిక్ మూవీ ఇది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలుంటాయి. జాన్ భూషణ్ అద్భుతమైన ఆరు పాటలు అందించారు. దానికి సురేష్ గంగుల సాహిత్యాన్ని సమకూర్చారన్నారు.
ఈ ప్రొడక్షన్‌లో రౌద్ర రూపాయ నమః మొదటి ప్రాజెక్ట్ కాగా ఈ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం ఓ మంచి చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.