SS Rajamouli : దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. “మోడ్రన్‌ మాస్టర్స్‌” అనే టైటిల్‌తో వచ్చే ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి సినీ ప్రయాణం, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, ఆయన దర్శకత్వ శైలి, ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సహా రాజమౌళి గురించి ఏమను కుంటున్నారో ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.

అనుపమా చోప్రా ఈ డాక్యుమెంటరీని సమర్పిస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్రలో నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!