చిత్రం : నేను కీర్తన
విడుదల తేది: 30-08-2024
బ్యానర్; చిమటా ప్రొడక్షన్స్
ఫైట్స్: నూనె దేవరాజ్,
సినిమాటోగ్రఫీ; కె.రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎమ్.ఎల్.రాజా
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
చిమటా రమేష్ బాబు హీరోగా తనే దర్శకత్వం వహించి, స్వయంగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘నేను – కీర్తన’. విడుదలకు ముందు అందరి దృష్టిని ఆకర్షించింది. నేడే థియేటర్స్ లోకి వచ్చిన ఈ నాన్ స్టార్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అయింది? ఏ రేంజ్ లో అలరిస్తుంది అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
సమాజంలోని అన్యాయాలను ఎదిరించే ఒక యువకుడి కథే నేను కీర్తన చిత్రం. జానీ అనే ఈ యువకుడు, తన చుట్టూ జరిగే అన్యాయాలను సహించలేక పోతాడు. అతను తన సాయం అర్థించేవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు. కీర్తన అనే అమ్మాయి జీవితంలోకి ప్రవేశించడంతో జానీ జీవితం మరో మలుపు తిరుగుతుంది. తనకు లభించిన శక్తిని సమాజ సేవకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న జానీ ఎలాంటి పోరాటాలు చేస్తాడనేది కథ.
విశ్లేషణ
ఈ చిత్రం లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్ వంటి అన్ని రకాల ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే, ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్‌ను కలపడం అవసరమా అనే సందేహం కూడా కలుగుతుంది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేస్తుంది.
హీరో కమ్ దర్శకుడు రమేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది అతని డెబ్యూ ఫిల్మ్ అని నమ్మడం కష్టం. విజయ రంగరాజు, జీవా తమ విలనీ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. కొత్తవాళ్ళైన హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
దర్శకుడిగా రమేష్ బాబు మంచి మార్కులు స్కోర్ చేశాడు. అయితే, రచయితగా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా, సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ చాలా బాగున్నట్లే. ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది. మొత్తం మీద చిన్న చిన్న లోపాలున్నా, ‘నేను – కీర్తన’ ఒక చక్కని వినోద చిత్రం. ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీలాంటి ప్రయత్నం విజయవంతమైంది అని చెప్పవచ్చు.
రేటింగ్ : 3/5