అందం .. అభినయం  ఆమెకు రెండు కళ్ళు.  ఆ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ..  దక్షిణాది భాషల్లోనే కాకుండా.. ఉత్తరాదిన కూడా రాణించింది. అటు మోడల్ గానూ  సత్తా చాటుకుంది. చేయబోయే పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయాలనే మనస్తత్వం ఉండడం వల్ల..  నీతూ చంద్రకు  అవకాశాలు బాగానే వచ్చిపడ్డాయి.

పాట్నాలో జన్మించిన నీతూ చంద్ర..  మోడలింగ్‌లో ఉంటూ వాణిజ్య ప్రకటనల్లో నటించి అవార్డులను సొంతం చేసుకొంది. నటిగా, నిర్మాతగా, క్రీడాకారిణిగా, కళాకారిణిగా పలు రంగాల్లో విజయం సాధించింది. తెెలుగు ప్రేక్షకులకు మొదట ‘విష్ణు’ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘గోదావరి, సత్యమేవ జయతే’ చిత్రాల్లోనూ నటించింది. మనం సినిమాలో కేమియో అపీరెన్స్ తో మెప్పించింది. వీటితో పాటు .. మళయాళం, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. నాట్య కళాకారిణిగా సొంతంగా రూపొందించిన ‘ఉమ్రవ్‌’ కథక్‌ నృత్యాన్ని వివిధ దేశాల్లో ప్రదర్శిస్తూ ఇప్పటికి 40 ప్రదర్శనలిచ్చింది. క్రీడాకారిణిగా ఆత్మరక్షణ విద్యలైన టేక్వాండో, కుంగ్‌ఫూ నేర్చుకొంది. హాంకాంగ్‌లో జరిగిన టేక్వాండో పోటీల్లో పాల్గొని ‘ప్రపంచ ఛాంఫియన్‌ షిప్‌’ సాధించింది. బాలీవుడ్‌లో ‘గరం మసాలా’ సినిమాతో అడుగుపెట్టి హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. తమ్ముడు నితిన్‌చంద్రతో కలిసి భోజ్‌పురి, మైథిలి భాషల్లో ‘దేస్వా’, ‘మైథిలి మఖాన్‌’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. నేడు నీతూ చంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సుందరికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే నీతూచంద్ర

Leave a comment

error: Content is protected !!