ఆడియెన్స్‌ ఊహించని విధంగా కొత్త కంటెంట్‌తో థ్రిల్ చేయడం ఒక తరహ.. ఆడియెన్స్‌ పల్స్‌కు తగ్గట్టు, ట్రెండ్‌కు అనుగుణంగా.. తెలిసిన కథలనే కొత్తగా అందిస్తూ.. ఆడియెన్స్‌ థ్రిల్‌ చేయడం మరో తరహా. ఏది ఏమైనా.. ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం కథకుడు దర్శకుల ప్రధాన ఉద్దేశ్యం. అలా ఆడియెన్స్‌ పల్స్‌ పసిగట్టి థ్రిల్‌ చేసే దర్శకుల కోవలో చేరుతారు రామ్‌రెడ్డి పన్నాల. రీసెంట్ గా ‘నేడే విడుదల’ చిత్రంతో మంచి బజ్‌ క్రియేట్ చేసారు. సినీ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యగా ఉన్న పైరసీ భూతం బ్యాక్‌డ్రాప్‌తో నేడే విడుదల చిత్రంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. సమస్యను లేవనెత్తడమే కాదు దానికి అందరూ అంగీకరించదగ్గ పరిష్కారం ఇవ్వడమే అసలైన ప్రతిభ. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడిగా నిలిచారు రామ్‌రెడ్డి పన్నాల. వారి అంతరంగాన్ని, సినిమా పట్ల వార అభిరుచిని వారి మాటల్లోనే ఈ స్పెషల్ చిట్‌చాట్‌లో తెలుసుకుందాం.

ప్రశ్న:
నమస్తే.. రామ్ రెడ్డి పన్నాల గారు.. ‘నేడే విడుద‌ల‌’ సినిమాతో మీరు ఇండ‌స్ట్రీలో అంద‌రి దృష్టిలో ప‌డ్డారు. ముందుగా మీ నేపథ్యం గురుంచి చెప్పండి.

స‌మాధానం:
న‌మ‌స్తే అండీ, మాది జగిత్యాల జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామం. మాది రైతు కుటుంబం. అమ్మ, నాన్న వ్యవసాయదారులు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఈ రంగానికి వ‌చ్చాను.

ప్రశ్న:
మీరు తీసిన‌ ‘నేడే విడుద‌ల‌’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది.. ఏ జానర్ లో తీశారు?
స‌మాధానం:
అవునండి.. ‘నేడే విడుద‌ల‌’ టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో పాటు, మంచి మెసేజ్ కూడా వుంది.

ప్రశ్న: ‘నేడే విడుద‌ల‌’ విడుద‌ల‌య్యాక‌ రెస్పాన్స్ ఎలా ఉంది? అన్ని ఏరియాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది?

స‌మాధానం:
సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెబుతున్నారు. సినిమాలో ముఖ్యంగా కామెడీ నచ్చి చాలా మంది ప్రేక్షకులు రిపీట్‌గా చూస్తున్నారు. సినిమా విడుద‌ల‌య్యాక అన్ని కేట‌గిరి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి సినిమాలే చేయ‌లంటూ చాలా మంది నుంచి నాకు కాల్స్, మెసెజ్‌లు వ‌చ్చాయి. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ కామెడీ డ్రామా. అందుకే అందరికి నచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జగిత్యాల లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ప్రశ్న:
ఫస్ట్ మూవీతోనే ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మీరు.. ఎవరి దగ్గరైన దర్శకత్వ శాఖలో పనిచేసారా?

స‌మాధానం:
నేను డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే డైరెక్టర్ మారుతీ టాకీస్‌లో కో-డైరెక్టర్ గా పనిచేసాను. నాకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారికి ఏకలవ్య శిష్యుడిని.

ప్రశ్న:
మున్ముందు ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?

స‌మాధానం:
సినిమాకు వ‌చ్చిన ప్రేక్షకుడిని ఆనందింప‌జేయ‌డం ముఖ్యమ‌నుకుంటాను. ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మెసెజ్ అందించాల‌నుకుంటాను. ప్రేక్షకులు ఆనందపడేలా, ఆలోచింపజేసేలా వుండే సినిమాలు చేయాలనుకుంటున్నాను.

Leave a comment

error: Content is protected !!