Nayanathara & Nazriya : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ, ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటోంది నయన్.
తాజాగా నయనతార క్రేజీ మల్లూ బ్యూటీ నజ్రియా ఫహాద్ ను కలిసింది. దాదాపు పదేళ్ల తర్వాత వీరి ఆత్మీయ కలయిక అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 2013లో విడుదలైన ‘రాజా రాణి’ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలుసుకోవడం ఇదే. ఇన్నాళ్ళకు మళ్లీ ఈ బ్యూటీస్ కలిసి కనిపించడం అభిమానులకు పండుగలా మారింది.
ఈ కలయిక సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి, నజ్రియా తన భర్త ఫహాద్ ఫాజిల్ తో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. వాటిలో “జై బీమ్”, “O2” చిత్రాలు ఉన్నాయి. నజ్రియా కూడా తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.