Nayanathara : కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార సినీ కెరీర్‌ దూసుకు వెళ్తోంది. ఇప్పటికే ఆమె డజన్లకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని తెలుస్తోంది. ఇటీవలే ‘మహారాజా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నిథిలన్ స్వామినాథన్, నయనతార కోసం ఒక శక్తివంతమైన నాయికా ప్రధాన కథను సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కథపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని, నయనతార కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నయనతార నటించిన ‘టెస్ట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Leave a comment

error: Content is protected !!