Nayanathara : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన అద్భుతమైన నటన, ఆకర్షణీయమైన అందంతో ప్రేక్షకులను ఎల్లప్పుడూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. గతేడాది విడుదలైన ‘జవాన్’ చిత్రంతో భారీ విజయం సాధించిన నయనతార, ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఎస్. శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెస్ట్’ చిత్రం నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఆర్. మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిందని చిత్రబృందం ప్రకటించింది.
తాజా సమాచారం ప్రకారం, ‘టెస్ట్’ చిత్రాన్ని ఓటీటీ వేదికపై విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించ నున్నారు. చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
ఈ చిత్రంలో నయనతార కుముధ అనే పాత్రను పోషించింది. వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నయనతార ‘డియర్ స్టూడెంట్స్’, ‘అమ్మోరు తల్లి 2’ వంటి చిత్రాలలో నటిస్తోంది.