ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలుగులో చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. తమిళనాడులో కూడా పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నయనతార విరాళం ప్రకటించింది. ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా)కు రూ.20 లక్షల విరాళం ప్రకటించింది.