Navin Polisetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత పది నెలల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి చివరకు అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. ఒక ప్రమాదంలో గాయపడిన కారణంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ప్రమాదంలో నవీన్ చేతి ఎముకలు బహుళంగా ఫ్రాక్చర్ అయ్యాయి. కాళ్ళకు కూడా గాయాలు అయ్యాయి. దీంతో వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

వేగంగా సినిమాలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఆరోగ్య రీత్యా నెలల తరబడి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని నవీన్ తెలిపాడు. చిన్నపాటి బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి, అద్భుతమైన సినిమాలతో అలరించాలని నవీన్ చెప్పాడు. త్వరగా కోలుకుని, కొత్త అప్డేట్స్ తో రాబోతున్నట్లు తెలిపాడు. ఎప్పటిలాగే తనపై ప్రేమను కొనసాగించాలని అభిమానులను కోరుతూ, “మీ జానేజిగర్” అంటూ ముగించాడు.

తన గాయాలతో ఉన్న ఫోటోను కూడా నవీన్ పోస్ట్ చేశాడు. ఈ ప్రమాదం వల్ల కథలు వినడం, స్క్రిప్ట్ లలో పాల్గొనడం ఆగలేదని నవీన్ స్పష్టం చేశాడు. కోలుకున్న తర్వాత ఎవరితో సినిమాలు చేస్తాడో, ఏ దర్శకులతో కలిసి పనిచేస్తాడో అనేది త్వరలోనే తెలుస్తుంది. అమెరికాలో జరిగిన ప్రమాదం నవీన్ కు ఊహించని అడ్డంకిగా మారింది. అయితే, త్వరగా కోలుకుని మళ్ళీ సినిమాలతో రాబోతున్నాడని నవీన్ ధీమా వ్యక్తం చేశాడు.

 

 

Leave a comment

error: Content is protected !!