Naresh VK : నవరస రాయ వీకే నరేశ్ ప్రధాన పాత్రలో తాజాగా ఈటీవీలో విన్ లో విడుదలైన ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూయర్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్‌లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సినిమా విడుదలైన తర్వాత సామాన్యులు కూడా సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, రివ్యూలు రాసిన తీరు చూస్తే ఇది ఒక ఆర్గానిక్ సక్సెస్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించారు.

నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నరేష్ తన అనుభవంతో పాత్రను మరింత ఆకట్టుకునేలా చేశారు. డైరెక్టర్ అనురాగ్ పలుట్ల తన దర్శకత్వం ద్వారా సినిమాకు మరింత బలం చేకూర్చారు. డీవోపీ, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ తమ పనిలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.

ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని, ఈ సినిమా తనకి గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా అని, అనురాగ్ పలుట్ల ఒక మంచి స్క్రీన్‌ప్లే రైటర్ అని ప్రధాన పాత్రధారి డా. నరేష్ వికె అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పారు. నరేష్ గారితో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం అని డైరెక్టర్ అనురాగ్ చెప్పారు.

ఈ సినిమా తనకు చాలా కనెక్షన్ ఉన్న సినిమా అని, నరేష్ గారు తనకు ఆదర్శం అని రాగ్ మయూర్ చెప్పారు. సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు ప్రియా వడ్లమాని ఆనందం వ్యక్తం చేశారు. ఇతర డైరెక్టర్స్ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఇలాంటి మంచి కంటెంట్ చేయాలనే స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.  ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. ఈ సినిమా విజయం తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మనం అభినందనలు తెలియజేయాలి.

Leave a comment

error: Content is protected !!