రెండు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ కాలం తర్వాత.. టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకొన్న సినిమాల తాలూకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని మొదలు పెట్టింది. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన షరతులతో కూడుకున్న అనుమతిని అనుసరించి .. సీనియర్ నటుడు నరేశ్ .. తాను నటించిన ‘జాతిరత్నాలు’ అనే కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం డబ్బింగ్ ను మొదలు పెట్టారు. ఇలా లాక్ డౌన్ తర్వాత డబ్బింగ్ చెబుతోన్న మొదటి నటుడు నరేశ్ అవడం విశేషం.
ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో ‘జాతిరత్నాలు’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం సూచించిన సేఫ్టీ మెజర్స్ ను అనుసరించి డబ్బింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటిస్తోన్న జాతిరత్నాలు చిత్రాన్ని కె.వి.అనుదీప్ దర్శకత్వంలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.
Actor @ItsActorNaresh took the initiative and started his dubbing for #JathiRatnalu movie today, following all the precautions & guidelines suggested by Government.@NaveenPolishety @priyadarshi_i @eyrahul @AnudeepKVDirect @SwapnaCinema @nagashwin7 #జాతిరత్నాలు pic.twitter.com/wmk8uBrGQT
— Hyd Movies (@hydmovies) May 29, 2020