ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో  మా అధ్యక్షుడు నరేష్ తన వంతుగా రూ. 11 లక్షల విరాళం ప్రకటించారు. అందులో రూ. 10 లక్షల రూపాయలను 10 వేల మంది మా సభ్యులకు రూ. 10 వేల వంతున అందజేయనున్నట్టు ప్రకటించారు. వారికి కావాల్సిన నిత్యవసరాలతో పాటు మరికొన్ని అవసరాల కోసం రూ. 10 వేల వంతున నగదు సాయం చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు సినీ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 1 లక్ష విరాళం ప్రకటించారు. మొత్తానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమే అని చెప్పాలి.

Leave a comment

error: Content is protected !!