బాణం చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. తొలి చిత్రం నిరాశపరిచినా.. తనదైన పెర్ఫార్మెన్స్ తో తదుపరి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించాడు. ‘సోలో, ప్రతినిథి, శంకర, రౌడీ ఫెలో, అసుర, బాలకృష్ణుడు, అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, వీరభోగ వసంతరాయలు’ లాంటి విభిన్నమైన చిత్రాలతో సత్తా చాటుకున్నాడు. అప్పుడే అతడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు అయిపోతోంది. అయితే అతడి తొలి చిత్రం బాణం తొలి షాట్ మాత్రం మే 5, 2009న చిత్రీకరించారట.
నారా రోహిత్ తొలి సారి ట్విట్టర్ లోకి ప్రవేశించిన సందర్భంగా `బాణం` తొలి రోజు తొలి షాట్‌కు సంబంధించిన ఫొటోని షేర్ చేసిన నారా రోహిత్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. `2009లో సరిగ్గా ఇదే రోజు నేను నటించిన `బాణం` తొలి షాట్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ సందర్భంగా నా గురువు, పెదనాన్న చంద్రబాబు నాయుడు, నా ప్రియమైన నారా లోకేష్ అన్నతో కలిసి ట్విట్టర్‌లోకి ప్రవేశించడం గౌరవంగా వుంది` అని ట్వీట్ చేశాడు. నారా రోహిత్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. శ్రీవిష్ణు, సుధీర్‌బాబుతో కలిసి ఆయన నటించిన చిత్రం `వీరభోగవసంతరాయలు`. ఈ సినిమా తరువాత నారా రోహిత్ నుంచి మరో చిత్రం రాలేదు. తాజాగా మేకోవర్ మార్చిన ఆయన ఇకపై కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నారట.
On this day in 2009, this was my first shot from Banam … On this Occasion, It's an honor and pleasure to join twitter alongside my Mentor and Pedha nanna @ncbn garu and my Dearest @naralokesh anna !
As the great saying goes "Family is not Biology, it's Loyalty" pic.twitter.com/XkicJoJc2x
— Rohith Nara (@IamRohithNara) May 5, 2020