హ్యాండ్సమ్ ఫేస్ .. మ్యాన్లీ లుక్స్ … స్టైలిష్ యాక్టింగ్ .. మాస్ ను మెప్పించే యాక్షన్ అతడి క్వాలిటీస్ . వైవిధ్యమైన కథల్ని ఎన్నుకోవడంలో అతడు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. విలక్షణమైన పాత్రల్ని ఎంపికచేసుకొని దానికి తగ్గ మేకోవర్ కూడా చేసుకొని ప్రతీ సినిమాకీ రెడీ అవడం అతడి హాబీ. పేరు నారా రోహిత్. 11 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో  అడుగుపెట్టి…  అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలతో బాణంలా  దూసుకుపోయాడు రోహిత్.

తన కుటుంబానికి సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ… ఆ ప్రభావం, ప్రమేయం లేకుండా తనకి నచ్చిన కథల్ని ఎంచుకొంటూ, పరిమిత వ్యయంతో కూడిన చిత్రాల్ని చేస్తూ ముందుకు సాగుతున్నాడు రోహిత్ . ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’ తదితర విజయాలు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. తన పాఠశాల విద్యని హైదరాబాద్‌లో, వడ్లమూడి విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంటర్మీడియట్, చెన్నై అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత న్యూ యార్క్‌ ఫిల్మ్‌ అకాడెమీలో నటనకి సంబంధించిన కోర్సు చేశాడు. 2009లో విడుదలైన ‘బాణం’ విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్‌ ప్రతిభేంటో ఆ చిత్రంతో తెలిసింది. దాంతో అతడికి వరుసగా అవకాశాలొచ్చాయి. వేగంగా సినిమాలు చేయడంలో రోహిత్‌ దిట్ట. ‘తుంటరి’, ‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘జ్యో అచ్యుతానంద’, ‘శంకర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘శమంతకమణి’, ‘కథలో రాజకుమారి’, ‘బాలకృష్ణుడు ,‘వీరభోగ వసంతరాయలు’, ‘ఆటగాళ్లు’ చిత్రాల్లో నటించి సందడి చేశారు. ‘పండగలా వచ్చాడు’ విడుదల కావల్సి ఉంది. ‘బాణం’లో సన్నగా కనిపించిన రోహిత్, ఆ తర్వాత కాస్త బొద్దుగా మారాడు. ‘బాలకృష్ణుడు’ చిత్రంతో తిరిగి నాజూగ్గా మారాడు. ఆరన్‌ మీడియా వర్క్స్‌ సంస్థని స్థాపించిన నారా రోహిత్‌ నిర్మాణంలోనూ పాలు పంచుకొంటున్నాడు. ఈ రోజు నారా రోహిత్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీబర్త్ డే నారా రోహిత్

 

 

Leave a comment

error: Content is protected !!