Saripoda Sanivaram : నాచురల్ స్టార్ నాని ఎర్లియర్ మూవీస్ దసరా, హాయ్ నాన్న చిత్రాలు రెండూ .. అద్భుతమైన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల్ని వరుసగా పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నానీ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిపోదా శనివారం”. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ తో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. నానీ కెరీర్ లోనే ఇది వెరైటీ యాక్షన్ మూవీ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి నానీ సెకండ్ లుక్ రిలీజ్ అయింది.

ఈ లుక్ లో నాని చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. పాత బైక్ నడుపుతూ నవ్వుతూ ఉన్న నాని లుక్ ఆకట్టుకుంటుంది. “ఆదివారం నుంచి శుక్రవారం వరకు కనిపించే వైలెన్స్ కి ఇన్స్యూరెన్స్ ఈ సూర్య” అనే ట్యాగ్ లైన్ తో నాని లోని సాఫ్ట్ యాంగిల్ ను చూపించడానికి ప్రయత్నించారు చిత్రబృందం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 29న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది. “సరిపోదా శనివారం” మరో హిట్ గా నిలుస్తుందో చూడాలి!

Leave a comment

error: Content is protected !!