Nani : నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. దీని తర్వాత మరోసారి ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే శక్తిమంతమైన ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ నెల మధ్య నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇంతకు ముందు విశ్వక్ సేన్ తో హిట్ , అడివిశేష్ తో హిట్ 2 చిత్రాల్ని తెరకెక్కించిన శైలేష్ కొలను ఈసారి నానీని పోలీసాఫీసర్ పాత్రలో తొలిసారిగా తెరపై ఆవిష్కరించబోతున్నాడు. గత రెండు చిత్రాల్లాగానే హిట్ 3 కూడా ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నట్టు సమాచారం.

‘హిట్ 3’తో పాటు నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసేందుకు నాని ప్రణాళికలు వేస్తున్నారు. నాని తన కెరీర్‌లో విభిన్న పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘హిట్ 3’ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

Leave a comment

error: Content is protected !!