Nani : నాచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాతో కొత్త అద్భుతాలను సృష్టిస్తూనే ఉన్నాడు. తన సినిమా ఎంపికలో అతను చూపించే జాగ్రత్త, ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకునే తీరు అతన్ని ఇతర హీరోల నుండి భిన్నంగా నిలబెడుతున్నాయి. నాని తన సినిమాల్లో ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, విభిన్న జోనర్‌లను ప్రయత్నించడానికి ఇష్టపడతాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ వంటి విభిన్న రకాల కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే అతను ఎంచుకునే ప్రతి కథలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి. ఇదే అతని సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ.

తన కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాలతో ప్రేక్షకులను పరిచయం చేసుకున్న నాని ఇప్పుడు టాలీవుడ్‌లో టైర్ 2 హీరోలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. తన ప్రతిభ మరియు కృషితో 60-100 కోట్ల మధ్య మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగష్టు 29న విడుదల కాబోతున్న “సరిపోదా శనివారం” మూవీతో నాని మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత అతని లైన్-అప్ చాలా బిజీగా ఉంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాని గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలోని సినిమా కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడవలసి ఉంది.

Leave a comment

error: Content is protected !!