Nandamuri Kalyan Ram : టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. “ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్” అనే టైటిల్ తో వచ్చిన ఈ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది.

టీజర్ లో కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. రుద్రాక్షలతో కూడిన పిడికిలితో యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు. దీనితో ఈ చిత్రం యాక్షన్ డ్రామా అని అర్ధమవుతోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాణం వహిస్తున్నారు. కాంతార, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరింత అధికారిక సమాచారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కళ్యాణ్ రామ్ గత చిత్రాలు బింబిసార, అమిగోస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!