Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండు టాస్కులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 109వ సినిమా షూటింగ్‌లో నిమగ్నమై ఉంటే, మరోవైపు తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4 కోసం కూడా సిద్ధమవుతున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు సాధించిన హ్యాట్రిక్ విజయాల స్థాయిని అందుకోవడానికి ఈ సినిమాతో కూడా ప్రయత్నిస్తున్నారు బాలయ్య. ఇందులో బాలకృష్ణ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుంది.

ఇక అన్‌స్టాపబుల్ విషయానికొస్తే.. ఈ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్‌లు భారీ విజయాన్ని అందుకోవడంతో, లిమిటెడ్ వెర్షన్‌లో మూడో సీజన్ కూడా ప్రసారమైంది. దీంతో నాలుగో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్‌లో అన్‌స్టాపబుల్ సీజన్-4 ప్రారంభం కానుంది. దీంతో దసరా కానుకగా తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ సీజన్‌లో బాలకృష్ణ చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. బాలకృష్ణ 109వ సినిమా, అన్‌స్టాపబుల్ సీజన్-4 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!