Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ఆగస్ట్ 30తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. పలువురు చిత్ర, రాజకీయ రంగాలకు చెందినవారు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలయ్య తన సినీ కెరీర్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు.

తన 50 ఏళ్ల సినీ జీవితం గురించి బాలయ్య మాట్లాడుతూ .. తన తండ్రి, నటుడు ఎన్టీఆర్ తనకు కేవలం తండ్రిగా కాకుండా గురువు, దైవం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఈ విశ్వానికే నట విశ్వరూపం అని ఆయన కారణంగానే తాను జన్మించానని బాలకృష్ణ అన్నారు.
బాలకృష్ణ తన జీవితం గురించి మాట్లాడుతూ, తాను చాలా సరదాగా ఉంటానని, అందరినీ నవ్విస్తూ ఉంటానని చెప్పారు. కానీ, ప్రేక్షకులు తనను యాంగ్రీ మ్యాన్‌గా భావిస్తారని, దీనికి కారణం తాను చేసే సినిమాలు అని అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, తన దగ్గర ఎలాంటి రహస్యాలు లేవని కూడా బాలకృష్ణ చెప్పారు.

Leave a comment

error: Content is protected !!