Nagasourya : యూత్ స్టార్ నాగశౌర్య ఇప్పుడు తదుపరి చిత్రంపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. ‘రంగబలి’ తర్వాత నాగశౌర్య మళ్ళీ స్ర్కీన్ పై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత బోలెడన్ని కథలు విన్నాడు. అయితే అవేమీ అతడికి సంతృప్తి నివ్వలేదు. ఈ నేపథ్యంలో శౌర్య.. తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు రంగబలి ఫేమ్ పవన్ బాసంశెట్టి.

రంగబలి’ ఫలితం కొంత నిరాశపరిచింది అయినప్పటికీ, నాగశౌర్య మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన తన తదుపరి చిత్రం కోసం మళ్లీ ‘రంగబలి’ దర్శకుడు పవన్ బాసంశెట్టితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు. ‘రంగబలి’లో నాగశౌర్య యూత్ లుక్ లో, మాసీగా కనిపించాడు. పవన్ ఆయనలోని కామెడీ టైమింగ్ ను బాగా తెరపైకి తీసుకువచ్చాడు. కానీ, సినిమా సెకండ్ హాఫ్ లో కథనం బలహీనంగా ఉండటం వలన సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఈ కాంబో మరోసారి కలిసి పనిచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Leave a comment

error: Content is protected !!