టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జునది ప్రత్యేకమైన స్టైల్. తండ్రి నాగేశ్వరరావు అడుగుజాడల్లో నడిచి.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నాగ్.. ఇప్పటి వరకూ  93 చిత్రాల్లో నటించారు. శత చిత్రాలకు కొన్ని చిత్రాల దూరంలో మాత్రమే నిలిచిన ఆయన .. హీరోగా టాలీవుడ్ లోకి ప్రవేశించి నేటికి సరిగ్గా 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. విక్రమ్ చిత్రంతో నాగ్ .. హీరోగా తెలుగు తెరంగేట్రం చేశారు. 1986, మే 23న విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.

తన నటవారసుడ్ని తెరకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న అక్కినేని నాగేశ్వరావు .. అభిమానుల అంచనాలకు తగ్గరీతిలోనే తన తనయుడి తొలి చిత్రం ఉండాలని .. అన్ని కమర్షియల్ హంగులతోనూ సినిమా తెరకెక్కాలని భావించారు. అదే సమయంలో బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ చిత్రం హీరో దుమ్మురేపేస్తోంది. ఆ సినిమాను తెలుగులో నాగ్ తో రీమేక్ చేయాలని తనకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు వి.మధుసూదనరావును రంగంలోకి దింపారు. హీరో చిత్రానికి కొద్ది పాటి మార్పులు చేర్పులు చేసి స్ర్కిప్ట్ రూపొందించారు. కథానాయికగా శోభనను  ఈ సినిమాతో తెలుగు రంగానికి పరిచయం చేశారు. మాస్ లవ్ స్టోరీగా కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. తొలి చిత్రంతోనే నాగార్జున ఫైట్స్ ను , డ్యాన్స్ ను అద్భుతంగా చేసి.. తొలి విజయాన్ని అందుకున్నారు.   సో.. అలా.. ఈ రోజు .. అక్కినేని నాగార్జున విక్రమ్ గా మారిన శుభదినంగా మారిపోయింది.

Leave a comment

error: Content is protected !!