Shopping Cart 0 items - $0.00 0

ఏప్రిల్ 2న రానున్న నాగ్ “వైల్డ్ డాగ్”

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారాయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌ అంద‌రిలో ఆస‌క్తిని కలిగిస్తుంది. అంతా కొత్తవాళ్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నాగార్జున మాట్లాడుతూ : సోలోమన్ తనకు ఊపిరి సినిమా నుండి పరిచయం తను రాసిన డైలాగ్స్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. అప్పుడు అనుకున్నాను తనకు మంచి భవిష్యత్ ఉందని అనుకున్నాను. ఇప్పుడు ఇలా “వైల్డ్ డాగ్” అంటు మంచి కథ తో వచ్చాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనందరికి కనెక్ట్ అయ్యిన కథ. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు చాలా చాలా కనెక్ట్ అయ్యిన సినిమా ఇది. ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాసట్లు కావచ్చు. అలా బ్లాస్ట్లు చేసిన వాళ్లు ఎక్కడ ఉంటారు వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనే విధంగా ఉంటుంది. సోలోమన్ ఈ సినిమాను మంచి థ్రిల్లర్ బుక్ లా సినిమా తీశాడు. సినిమాలో తనకు సహకరించే టీం అందరూ దాదాపుగా అంతా కొత్తవారే. ఇక్కడ ఉన్న వెపన్స్ లో కొన్ని రియల్ వెపన్స్ కూడా ఉన్నాయి. సినిమాలో కూడా అవసరమైన చోట రియల్ వెపన్స్ వాడాం. ముందుగా సినిమాను ఓటిటి & నెట్ఫ్లిక్ష్ లో రిలీజ్చేద్దామని అనుకున్న కాని ఈ సంవత్సరంలో వచ్చిన “క్రాక్” & “ఉప్పెన” సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి. కరోనా తర్వాత ధియేటర్ కి వచ్చిసినిమాలు చూస్తున్న ప్రేక్షకులే సినిమా విజయానికి కారణం అన్నారు. “వైల్డ్ డాగ్” అనే టైటిల్ పెట్టడానికి కారణం ఓ నాలుగు వైల్డ్ డాగ్స్ అనేవి తలచుకుంటే ఒక సింహాన్ని చంపగలవు అంతా స్ట్రాంగ్ గా అవి అంతలా వేటాడుతాయి. అలా సినిమాకి “హంటింగ్” అంటే “వేట” అని కూడా పేరు పెట్టొచ్చు కాని తనకు “వైల్డ్ డాగ్ ” పేరు బాగా కనెక్ట్ అయ్యింది అని చెప్పారు. సినిమా ఏప్రిల్ 2న విడుదలని రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Leave a comment

error: Content is protected !!