Coolie movie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న అదిరిపోయే యాక్షన్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా సెట్స్ లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. డైనమిక్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్దిరోజులుగా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్ లో రజనీ అండ్ నాగ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బంగారం స్మగ్లింగ్ అనే ఆసక్తికరమైన నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో రజనీ దేవాగా, నాగ్ సైమన్ గా కనిపించనున్నారు. శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

రజనీ అండ్ నాగ్ కలిసి తెరపై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కారణంగా ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది.

Leave a comment

error: Content is protected !!