టాలీవుడ్ స్టార్ హీరోస్ .. ఎప్పటికప్పుడు తమ అభిమానులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుతుంటారు.  తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను సైతం స్టార్స్ పంచుకుంటుండటంతో వారిని అనేక మంది ఫాలో అవుతుంటారు.ఈ క్రమంలోనే ఒక్కో స్టార్‌కు ఒక్కో రేంజ్‌లో ఫాలోవర్స్ ఉంటారు.

కాగా స్టార్ హీరోల ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో ఫాలోవర్స్‌ను సంపాధించుకుని మన స్టార్స్ సోషల్ మీడియాలోనూ పలు రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్‌లో ఏకంగా 6 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాధించుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. మొన్న విక్టరీ వెంకటేశ్ ఇన్ స్టా గ్రామ్ లో  1మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు నాగ్ ట్విట్టర్ లో 6 మిలియన్స్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం విశేషంగా మారింది.

Leave a comment

error: Content is protected !!