Coolie movie : సౌత్ సినీజనం సంబరాలు చేసుకొనే అప్డేట్ ఒకటి వచ్చింది. ఇద్దరు సౌత్ స్టార్స్ నాగార్జున అండ్ రజనీకాంత్ ఒకే చిత్రంలో కలిసి నటించ బోతున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ అనే చిత్రం ద్వారా ఈ స్టార్స్ కలయిక సాధ్యమైంది. నాగార్జున తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చిత్రంలో నాగార్జున ‘సైమన్’ అనే కీలక పాత్రను పోషించనున్నారు.

ఈ అద్భుత అవకాశం గురించి నాగార్జున తన సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రజనీకాంత్ గారితో కలిసి తెరను పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో తనకు చాలా కాలంగా కలిసి పని చేయాలనే కోరిక ఉందని తెలిపారు. రజనీకాంత్ 171వ చిత్రంగా ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ పరిశ్రమలో చరిత్రాత్మకమైన ఈ కలయిక సినీ ప్రేమికులను ఖుషీ చేస్తోంది. నాగార్జున అండ్ రజనీకాంత్ కలిసి ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తారో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!