కార్నివాల్ పేరుతో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రెస్ మీట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగింది.

ఈ సందర్భంగా  నాగబాబు మాట్లాడుతూ: ఆగష్టు 22 న మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలెబ్రేషన్స్ మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా “కార్నివాల్” పేరుతో “హైటెక్స్” లో బర్త్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మొట్ట మొదటి సారి హాలివూడ్ తరహాలో కార్నివాల్ ని మెగా స్టార్ బర్త్ డే ద్వారా ఇండియా లో పరిచయం చేస్తున్నాం. ఈ కార్నివాల్ అభిమానుల అందరికి ఎంత గానో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ కార్నివాల్ కి మా ఫ్యామిలీ హీరోలు, కొంత మంది చిరంజీవి గారిని అభిమానించే సినిమా సెలబ్రిటీలు హాజరవుతారు. అసలు అన్నయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరపడానికి ముఖ్య ఉద్దేశం మెగా అభిమానులు. ఎందుకంటే, ఎంతో మంది అభిమానులు చిరంజీవి గారిని ఇష్టపడే వాళ్ళు కొకళ్ళలో ఉన్నారు. అందుకే, కొన్ని వందల వీక్షించేలా ఈ కార్నివాల్ ని ఏర్పాటు చేసాం. చిరంజీవి గారి గురించి ఎవ్వరికి తెలియని కొన్ని విషయాలు అభిమానులతో కార్నివాల్ లో చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్నివాల్ ప్రతి ఒక్కరికి మీడియాకి, అభిమానులకి, ఫ్యామిలీ కి మెమొరబుల్ డే కానుంది.

Leave a comment

error: Content is protected !!