మూవీ: ‘థాంక్యూ’
నటి నటులు: నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సాయి సుశాంత్ రెడ్డి, సంపంత్ రాజ్ తదితరులు…
డైరెక్టర్: విక్రమ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్. థమన్
సినిమాటోగ్రాఫర్: పీసి శ్రీరామ్
ఎడిటర్: నవీన్ నూలి
రైటర్: బివిఎస్ రవి
మూవీ రీలిజ్: జులై 22-2022
నాగ చైతన్య, రాశి ఖన్నా,మాళవిక నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రలు గా నటించిన సినిమా “‘థాంక్యూ”. శ్రీమతి అనిత సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ సెన్సిటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. “బివిఎస్ రవి” కథ రాసిన ఈ సినిమా కి, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నాగ చైతన్య హీరో గా యాడ్ అవ్వడం. నాగ చైతన్య మహేష్ బాబుకు అభిమానిగా నటించడంతో ఈ సినిమా పై భారీ అంచానాలు క్రియేట్ అయ్యాయి. అదే విధంగా ఈ సినిమా కి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం, 70% ఎబ్రాడ్ లో షూట్ చెయ్యడం విశేషం. ఈ వారం రీలిజ్ అయ్యిన ఈ సినిమా మరి ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?
కథ: రావ్ కన్సల్‌టెన్సీ యజమాని రావ్(ప్రకాష్ రాజ్) ద్వారా అభిరామ్(నాగ చైతన్య) అమెరికా కి ఉద్యోగం కోసం వస్తాడు. అభిరామ్ కి ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తుంటాడు. కానీ ఇంటర్వ్యూ ల కి వెళ్లకుండా అందరికి ఉపయోగ పడే ఒక “వైద్య” యాప్ ని డెవెలెప్ చేస్తాడు. తన ఐడియాలజీ నచ్చడంతో పాటు, తన మీద ఇష్టం తో రాశి ఖన్నా(ప్రియా) ఇన్వెస్ట్ చేస్తుంది. దాంతో అమెరికా లోనే టాప్ బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతాడు. ప్రియా & అభి ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉంటారు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు రెండు రావటంతో అభిలో తెలియని గర్వం మొదలవుతుంది. ఒక రోజు రావ్(ప్రకాష్ రాజ్) ఉద్యోగ అవకాశాలు కోసం అభిరామ్ దగ్గరికి వస్తే అవమానించడంతో తట్టుకోలేక చచ్చిపోతాడు. దాంతో, ప్రియా(రాశిఖన్నా) అభిరామ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. అభిరామ్ ఎలా మామూలు మనిషి అయ్యి ప్రియా కి దగ్గరయ్యాడు? అభిరామ్ కి తన మనసాక్షి ఏం చెప్పింది? అభిరామ్ ఈ సక్సెస్ లో ఉండటానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారకులు ఎవ్వరు? అనేది కథ
కథనం, విశ్లేషణ:‘థాంక్యూ’ సినిమా కథ మొత్తం నాగ చైతన్య చుట్టూనే నడుస్తుంటుంది. ఒక ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని నడిచే సినిమా ఇది. ఇలాంటి కథలు వినేటప్పుడు కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే అవకాశాలు ఎక్కువ. అందుకే కాబోలు దిల్ రాజు ఈ సినిమా ని ఒప్పుకొని చేయడం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ముప్పై ఐదేళ్ల వ్యక్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య దశలను స్క్రీన్ మీద చూపించి, ఆ మూడు పాత్రలో ఒదిగిపోవటానికి నాగ చైతన్య పడిన కష్టం ఈ రోజు ఫలితం దక్కింది అనే చెప్పాలి. అమెరికాలో ఒక టాప్ బిజినెస్ మ్యాన్ గా స్టైలిష్‌గా కనిపించే పాత్రలో చాలా సింపుల్‌గా ఒదిగిపోయారు. అదే విధంగా బరువు తగ్గటం..మళ్లీ ఆ తర్వాత కనిపించే పాత్రలో రగ్డ్‌గా కనిపించటం నాగ చైతన్య ఎఫ్ఫర్ట్స్ కి ఫిదా అవ్వుతారు ప్రేక్షకులు.
రాశీ ఖన్నా మునపటి లాగే చాలా చక్కగా నటించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నవ్యక్తి మారినప్పుడు ప్రేమికురాలు గా పడే మానసికమైన ఒత్తిడిని తన నటనతో ప్రేక్షకులని అబ్బురపరిచింది.
నారాయణ పురం గ్రామంలో నాగ చైతన్య – మాళవిక నాయర్(పార్వతి) కాంబినేషన్ లో వచ్చే లవ్ సీన్స్ టెర్రిఫిక్ గా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మాళవిక నాయర్ చేసిన మెథడ్ యాక్టింగ్, అలాగే కొన్ని క్లోజ్ అప్ షాట్స్ లో మునుపెన్నడూ లేని విధంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎస్పిషియల్లి, మాళవిక నాయర్(పార్వతి) వదిలి వెళ్లే సీన్స్ అండ్ డైలాగ్స్ కి ఆడియెన్స్ విజిల్ వేస్తారు.
అవికా గోర్ చెల్లెలు పాత్రలో చక్కగా పెర్ఫామ్ చేస్తూ అభిరామ్(నాగ చైతన్య) కి రాఖీ కట్టి దగ్గరయ్యే కొన్నిఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అదే విధంగా శర్వా(సాయి సుశాంత్ రెడ్డి) & అభిరామ్ తో తలపడే మహేష్ బాబు కట్ అవుట్ సీన్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
భావోద్వేగంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యనట్టు అనిపిస్తుంది. అలాగే, సెకండ్ ఆఫ్ లో అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపించినా సినిమా ని బాగా బ్యాలెన్స్ చేసారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ఒక వ్యక్తి జీవితంలో సాధించిన విజయాల వెనుక ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఎంతో మంది సహకారం ఉంటుంది. వెనక్కి తిరిగి అలాంటి వారిని కలుసుకునే అభిరామ్ భావోద్వేగ ప్రయాణమే ‘థాంక్యూ’ సినిమా.
నటి నటులు పెర్ఫామెన్స్: మూడు ముఖ్య దశల పాత్రలని స్క్రీన్ మీద నాగ చైతన్య అవలీల గా చేసారు. ఈ మధ్య రాశీ ఖన్నా కి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన, ప్రేక్షకులు ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవ్వడం విశేషం. మాళవిక నాయర్ ఒక గొప్ప నటి అనే చెప్పాలి, ఆమె పోషించిన ముఖ్యమైన పాత్ర ఇంకెవ్వరు చేయలేరు అనేంతగా యాక్టింగ్ చేసారు. అవికా ఉన్నత వరుకు యాక్టింగ్ సూపర్బ్. ప్రకాష్ రాజ్ సినిమాలో ఏడిపించేస్తారు. సాయి సుశాంత్ రెడ్డి యారోగెంట్ గా చేసిన పాత్రలో బాగా రాణించారు. ఇక ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావ్, తులసి, సంపత్, భరత్, శశాంక్ తదితరులు వారి వారి పాత్రల పరిధులు మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం: డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తనదైన స్టైల్ లో సినిమా ని బాగా ప్రెజెంట్ చేసారు. ఈ సినిమా కి మంచి కాస్టింగ్ ఉండటం ఒక ఎస్సెట్ అనే చెప్పాలి. కాకపోతే, పలు సన్నివేశాలు ల్యాగ్ ఉండటం, కొన్ని సందర్భాలలో ఎమోషన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోవడం ఇలాంటివి ఉన్న కథ పరంగా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వుతారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాంగ్స్, బీజీఎమ్ అద్భుతంగా ఇచ్చారు. ఇక పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ మ్యాగ్నిఫిషియంట్. ఎడిటర్ పని తీరు సూపర్బ్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి.
బాటమ్ లైన్: మనసు దోచుకున్న “థ్యాంక్ యు”
రేటింగ్: 3/5
Review by – Tirumalasetty Venkatesh