హోయ్‌ అలాంటి అందమే అంటూ.. యూత్‌ఫుల్ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సాంగ్‌ మాధవే మధుసూధన మూవీ నుంచి నాగచైతన్య లాంచ్‌ చేసారు. సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్‌లో బొమ్మదేవర శ్రీదేవి ప్రజెంట్ చేస్తున్న మాధవే మధుసూధన చిత్రంలో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జోడీగా నటిస్తున్నారు. బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. హీరో నాగచైతన్యకు ఈ చిత్ర దర్శకుడు రామచంద్రరావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో సాంగ్ లాంచ్‌కు విచ్చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. హీరో తేజ్‌ లుక్స్‌, యాక్టింగ్ , డాన్స్‌ టాలెంట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా చిత్ర దర్శకుడు రామచంద్రరావుతో ఉన్న జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. చిన్నపుడు చై హాలీడేస్‌లో నాగార్జున షూటింగ్స్‌కు వెళ్లినపుడు కెమెరా గురించి రామచంద్రరావే నేర్పించారట. ఇప్పుడు వారు దర్శకుడిగా ఓ సినిమా తీసి అందులోని ఓ సాంగ్‌ను లాంచ్‌ చేయడానికి నాగచైతన్యను ఆహ్వానించడం.. చై సాంగ్ లాంచ్‌ చేయడం ప్రత్యేక అనుబంధాన్ని ప్రతిఫలించేదే. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా నాగచైతన్యే వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి పాటను కూడా నాగచైతన్యనే రిలీజ్‌ చేయడం విశేషం.

నటీ నటులు: తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, సుమన్, రామచందర్, శైలజా ప్రియ, నవీన్ నేని, విజయ్ మాస్టర్, బేబీ సమన్విక, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీలత తదితరులు.
సమర్పణ: బొమ్మదేవర శ్రీదేవి, బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్, రచన-దర్శకత్వం, నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వాసు, సంగీతం: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్ బి, మాటలు: బి సుదర్శన్, కొరియోగ్రఫీ: రాజు-సుందరం, బృంద, రఘు, యాష్, పాటలు: శ్రీమణి, అనంత శ్రీరామ్, విరించి పుట్ల, సింగర్స్: విజయ్ ప్రకాష్, అనురాగ్ కులకర్ణి, కపిల్ కపిలన్, రమ్య బెహ్రా, హరిప్రియ, వైష్ణవి కొవ్వూరి, ఫైట్స్: విజయ్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్ కె తాళ్ళూరి, స్టిల్స్: పాండియన్, కో డైరెక్టర్: మురళి.యన్, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ ప్రసాద్, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళీకృష్ణ.

Leave a comment

error: Content is protected !!