కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు.
కొందరు ఇష్టమైన సినిమాలు చూస్తున్నారు. మరికొందరు వంటలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో నటి నదియా ఒకరు. ఇటాలియన్ లాసాగ్నే పాస్తా అనే వంటకాన్ని తయారు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నదియా. దానికి ‘‘ఇదొక రహస్య పదార్థం యొక్క సృతనాత్మకత.. క్వారెంటైన్ కుకింగ్’’ అంటూ ట్యాగ్‌లైన్ తగిలించింది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో ఆకర్షణ గా మారింది ఆ వీడియో.