అల్లరి నరేశ్ ను సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ.. మనోడు నట విశ్వరూపం ప్రదర్శిస్తాడు. లాస్టియర్ మహేశ్ ‘మహర్షి’ చిత్రంలో నరేశ్ పెర్ఫార్మెన్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకు ముందే ‘నేను, శంభోశివ శంభో, గమ్యం’ సినిమాలతో తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు అల్లరోడు మరోసారి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కు సిద్ధమవుతున్నాడు. సినిమా పేరు నాంది. టైటిల్ ను బట్టి.. ఈ సినిమాతో అల్లరి నరేశ్ పూర్తికొత్తదనానికి నాంది పలుకుతున్నాడని అర్ధమవుతోంది. అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా .. నేడు విడుదలైన ‘నాంది’ టీజర్ కూడా అందుకు తగ్గట్టుగానే ప్రామిసింగ్ గా ఉంది. టీజర్ లో ఓ సరికొత్త నరేశ్ కనిపిస్తున్నాడు.
అసలు జైళ్ళల్లో ఖైదీలెంత? వారిలో నేరం చేసినవారి సంఖ్య ఎంత? ఆ నేరస్థుల్లో శిక్ష విధించిన వారి సంఖ్యఎంత ..? లాంటి లెక్కలతో వాయిస్ ఓవర్ ప్రారంభమవుతుంది. అందులో అల్లరి నరేశ్ మీద అన్యాయం గా కేసు నమోదు చేసి చాలా కాలంగా అతడ్ని జైల్లో ఉంచినట్టు అర్ధమవుతుంది. ఆ క్రమంలో అతడు ఒక సన్నివేశంలో నగ్నంగా కూడా రివీల్ అవుతాడు. అసలు మనిషి పుట్టడానికే 9 నెలల టైమ్ పడుతుంది. అలాంటిది నాకు న్యాయం చెప్పాడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? అనే నరేశ్ అడిగే ప్రశ్నలోనే ‘నాంది’ చిత్ర కథ అంతా ఉంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీశ్ వేగేశ్న నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో వకీల్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తోంది. మరి ‘నాంది’ చిత్రం అల్లరోడికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
టీజర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి