లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న “N th HOUR” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శక,నిర్మాత యస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాతలు ఏ. యం రత్నం, అచ్చిరెడ్డి, దామోదర్ ప్రసాద్ , బెక్కం వేణుగోపాల్ , ప్రసన్న కుమార్, డి యస్. రావు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా . నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు..ప్రముఖ దర్శకుడు యస్. వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
ముఖ్య అతిధిగా వచ్చిన ఏ. యం రత్నం “N th HOUR ” పోస్టర్ ను లాంచ్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత ఏ. ఎం రత్నం మాట్లాడుతూ. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెకక్కుతున్న ఈ సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి అడ్వెంచర్ కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
చిత్ర నిర్మాత రాజు గుడిగుంట్ల మాట్లాడుతూ..దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉందో కథ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మాకు మంచి నటీ, నటులు, టెక్నిషియన్స్ లభించారు.నెక్స్ట్ మంత్ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మంచి అడవెంచర్ కథ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
చిత్ర దర్శకుడు ఆనంద్ కొలగానీ మాట్లాడుతూ ..కథలో జరిగే సంఘటనలు అనూహ్యంగా ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియకుండా జరుగుతున్నందున ఈ సినిమాకు న “N th HOUR” అనే టైటిల్ పెట్టడం జరిగింది.
విన్నూ తన మైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ కథగా వస్తున్న ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన విశ్వ కార్తికేయకు జంటగా బాలీవుడ్ నటి రిషికా కపూర్ తెలుగు తెరకు పరిచమవుతుంది. ఈ అడ్వెంచర్ కథను మా నిర్మాతకు చెప్పిన వెంటనే తనకు నచ్చి ఈ తరహా కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఇంట్రెస్ట్ చూయించి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్ ప్యాకేజ్డ్ గా ఉంటుంది. ఈ సినిమా ను నెక్స్ట్ మంత్ 6 నుండి మొదటి షెడ్యూల్ లో స్టార్ట్ అవుతుంది.
హీరో విశ్వ కార్తికేయ .. చాలా మంది లెజెండ్స్ వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేసినందుకు ధన్యవాదములు.. ఆనంద్ గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆడియన్స్ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది .ఇలాంటి అడ్వెంచరస్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.అన్నారు
హీరోయిన్ రిషికా కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ మవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి అడ్వంచర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
లంకదాసరి ప్రసాద్ రావు : మా అల్లుడు కూతురు తీస్తున్న “N th HOUR” అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కథ ను తీస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
నటీ నటులు
విశ్వ కార్తికేయ (హీరో)
రిషికా కపూర్ (హీరోయిన్)
అర్జున్ అంబటి, భద్రం, కిర్రాక్ సీత, షారన్ ఫెర్నాండెజ్,
శుభోదయం సుబ్బారావు, వాసు ఇంటూరి, యూట్యూబర్ చందూ సాయి, సతీష్ సరిపల్లి, జోర్దార్ సుజాత, జబర్దస్త్ ఐశ్వర్య తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్: లేడీ లయన్ క్రియేషన్స్
నిర్మాత: రాజు గుడిగుంట్ల
దర్శకత్వం: ఆనంద్ కొలగాని
DOP: చెంచు J
సంగీతం: శశాంక్ ఆలమూరు – మాహా
ఎడిటర్: నందమూరి హరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాదెండ్ల సురేష్ బాబు
CEO: G. లక్ష్మీ ప్రియాంక