సింగర్ కారుణ్య పరిచయం అవసరం లేని పేరు తనది. ఇండియన్ ఐడల్ పాటల విభాగంలో రన్నరప్ గా నిలిచి దేశమంతా అభిమానులను సొంతం చేసుకున్న పాటగాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలను ఆలపించారు. కారుణ్య మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమాలోని ‘సదా శివ’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే  రామ్ చరణ్ ‘ఆరెంజ్’ లోని ‘సిడ్నీ నగరం’ పాటతో పాటు పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ లోని ‘వయ్యారాల జాబిల్లి’ వంటి మెలోడీ పాటలతో సంగీత ప్రియులకు మరింత చేరువయ్యారు. తన జీవితంలో సింగర్ గా ఎదగడానికి దోహదపడిన కారణాలు, అలాగే ఇన్స్పైర్ చేసిన వ్యక్తులను గురించి మూవీ వాల్యూమ్ తో ముచ్చటించారు సింగర్ కారుణ్య. ఆ విశేషాలు…

 కారుణ్యని లైఫ్ లో ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ… నా జీవితంలో చాలా మంది నన్ను ఇన్స్పైర్ చేశారు. ఇన్స్పిరేషన్ అనేది వ్యక్తిగతంగానా లేక మ్యూజిక్ పరంగానా అనేది చూసుకుంటే… ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే…

 నాకు మొదటి నుండి కూడా పి. సుశీల నుంచి స్ఫూర్తిని పొందాను. ఆమె పాట పాడేటప్పుడు తన డిక్షన్, అలాగే ఘంటసాల వారి మాధుర్య గాత్రం ఆయన కంచు కంఠం నుండి వచ్చే పద్యాలైతే నేమి పాటలలోని పదాల స్పష్టతేనేమి. వారిద్దరూ ఎటువంటి పాట పాడిన కూడా పాటలోని మాధుర్యం భావం మిస్ అవ్వకుండా పాడే గాత్రాలు వారి సొంతం. బాలసుబ్రహ్మణ్యం ను ఉద్దేశిస్తూ… అసలు పాడుతూ కూడా యాక్టింగ్ ఎలా చేయాలి. ఆయన పాటలను గమనిస్తే తెరపై ఏ హీరో కనపడుతున్నాడో ఆ హీరోకు తగినట్లు వాయిస్ చేంజ్ చేసి పాడటం ఆయనకే సొంతం. ముఖ్యంగా రొమానిటిక్ పాటలలో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతం ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. హృదయం నుండి పాటలను ఆలపించే కిషోర్ కుమార్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఏ పాట పాడిన కూడా గుండె నుండి పాడుతున్న ఫీల్ క్యారీ చేస్తారు. ఈ విధంగా పాడే విధానాన్ని నేను ఆయన నుండి నేర్చుకున్నాను. మరికొందరిని ప్రస్తావించాల్సి వస్తే బాలమురళికృష్ణ ఆయనలా గొంతును చాలా రకాల మాడ్యులేషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళని ఎవరిని చూడలేదు. అలాగే  ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వారికి మాత్రమే సొంతమైన పవిత్రమైన గాత్రంతో ఎంతో ఆధ్యాత్మికంగా పాడే ఆమె లాంటి వాళ్ళని మరెక్కడా చూడలేదు. వీళ్ళు సింగర్స్ గా  ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తులు గా నిలుస్తారు.

 నాకు సంగీత విద్యను నేర్పించిన గురువు నల్లా చక్రవర్తి మూర్తి. ఆయన చేసిన కంపొజిషన్స్ తో పాటు తనలోని పాండిత్యంలో పదో వంతైన పాడాలని నాకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆ తర్వాత కుటుంబం విషయానికి వస్తే నా తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు నాలోని ఆసక్తిని గమనించి సంగీతం వైపు నన్ను నడిపించినందుకు. వాళ్ళ గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమకు నిర్వచనం అని చెప్పొచ్చు. అలా చూసుకుంటే ఇన్స్పైర్ చేసిన సింగర్స్ లలో మైఖేల్ జాక్సన్ కావచ్చు, జస్టిన్ టింబర్ లేక్ కావచ్చు చాలా రకరకాల మంది ఉన్నారు. నేను చాలా విషయాల్లో గాంధీగిరిని అవలంభించాలని ఆచరిస్తూ ఫెయిల్ అవుతుంటాను. అయినా నాకు వ్యక్తిగతంగా ‘జీవితంలో ఇన్స్పైర్ చేసింది గాంధీజీ. చాలా సార్లు అనుకునే వాణ్ని ఆయన ఇలాంటి కఠినమైన జీవిత సూత్రాలను అంత సులువుగా ఎలా అవలంభించేవారో అని అనుకుంటాను. అలాగే ఈ జీవిత ప్రయాణంలో ఎదురుపడే ప్రతి ఒక్కరినుండి కూడా ఎదో ఒక మంచి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొనసాగుతానని ముచ్చటించారు కారుణ్య.


Leave a comment

error: Content is protected !!