Shopping Cart 0 items - $0.00 0

మువ్వగోపాలుడు

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చెప్పుకోదగ్గ కుటుంబ కథా చిత్రం ‘మువ్వగోపాలుడు’. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. శోభన, విజయశాంతి, రావుగోపాలరావు, జయచిత్ర, గొల్లపూడి మారుతీరావు , కెకె శర్మ, వై. విజయ  తదితరులు నటించిన ఈ సినిమా 1987, మే 9న విడుదలైంది. నిజానికి ఈ సినిమా 1986లో తమిళంలో వచ్చిన ‘అరువడై నాళ్’  చిత్రానికి రీమేక్ వెర్షన్. ప్రభు,  పల్లవి జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో కూడా బాగా ఆడింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ‘మువ్వగోపాలుడు’  సినిమాలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.

Leave a comment

error: Content is protected !!