క్రికెట్ అంటే రికార్డులు కాదు.. స్నేహితుల్ని చేసుకోవడం.. మైదానం బయట సచిన్, గంగూలి, అనిల్‌కుంబ్లే నాకు స్నేహితులు.. ఇప్పుడు వీవిఎస్‌ లక్ష్మణ్‌ లాంటి ఫ్రెండ్‌ ఉండటం నా లక్‌.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన వీరుడు ముత్తయ్య మురళీధరన్‌.

మురళీధరన్‌ బయోపిక్‌ 800 మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా జరిగింది. ఈ సందర్భంగా వీవిఎస్‌ లక్ష్మణ్ ముఖ్యఅతిధి హాజరయ్యారు. ఒకరికొకరు తమ అనుబంధాన్ని చాటారు.

ముత్తయ్య మురళీధరన్ మంచి ఆటగాడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి, నిగర్వి.. నాకు అన్న కంటే ఎక్కువ.. క్రికెట్ స్టార్ట్‌ చేసిన దగ్గర్నుంచి రిటైర్‌ అయ్యేవరకు ఇన్‌స్పైర్‌ చేసిన వ్యక్తి.. ఇప్పుడు కూడా ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌ అందిస్తున్న వ్యక్తి అంటూ మురళీధరన్‌ ను పొగడ్తలతో ముంచెత్తాడు వీవిఎస్‌ లక్ష్మణ్.

వీవిఎస్‌ లక్ష్మణ్‌ స్పిన్ అడటంలో మేటి. 1998 లో లక్ష్మణ్‌ ను చూసా.. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్‌ ఆడినపుడు కలిసాం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు ఎన్నో రోజులు కలిసి పనిచేసాం. వేర్వేరు దేశాలకు ఆడినపుడు లక్ష్మణ్ వికెట్‌ను మెండిస్‌ తీసేవాడు..నేను ఔట్‌ చేయలేకపోయేవాడినంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే.. ఫ్లైట్‌లో వెళ్లేటపుడు సరదాగా బిర్యాని కావాలని అడిగితే.. రకరకాల బిర్యానిలు తెప్పించాడు.. అదీ వీవిఎస్‌ లక్ష్మణ్ అంటే అంటూ సరదా ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా స్టేజ్‌ మీద పంచుకున్నారు ముత్తయ్య మురళీధరన్‌. సెలబ్రిటీలతో క్రికెట్ టీమ్‌ ఏర్పడితే కెప్టెన్‌ ఎవరైతే బాగుంటుందన్న దానికి సమాధానంగా వెంకటేష్ పేరు చెప్పారు మురళీధరన్‌.. అలాగే నానితో ఉన్న పరిచయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.

ముత్తయ్యమురళీధరన్‌గా స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌, మదిములర్‌ పాత్రలో మహిమనంబియార్‌ నటిస్తున్న 800 చిత్రాన్ని ఎంఎస్ శ్రీపతి డైరెక్షన్‌లో మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ సహకారాన్ని బుకర్‌ ప్రైజ్ అవార్డ్‌ గ్రహీత కరుణతిలక అందించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శ్రీ శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రానికి సమర్పకులు. అక్టోబర్‌ 6 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!