Srivasanth : అల్లరి నరేష్ “సుడిగాడు” సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్ పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. విభిన్న పాత్రలతో అలరించే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో, సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళనిస్వామి నిర్మాతలుగా జూన్ 14న విడుదలైన “మహారాజ” చిత్రానికి శ్రీ వసంత్ సంగీతం, సాహిత్యం అందించారు.

“అమ్మా నీకే నాన్నయ్యానా” అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం పాటకు మరో హైలైట్ గా నిలిచింది. “మహారాజ” సినిమా విడుదలైన ప్రతిచోటా మంచి స్పందన పొందుతోంది. ముఖ్యంగా మాటలు, పాటలకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం, ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది.

ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం చాలా సంతోషంగా ఉందని శ్రీ వసంత్ తెలిపారు. “మహారాజ” సినిమా డబ్బింగ్ పనులు శ్రీ వసంత్ స్వంత డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్” లో జరిగాయి. ఇటీవల మంచి విజయం సాధించిన “కార్తికేయ 2” సినిమా డబ్బింగ్ కూడా ఈ కంపెనీలోనే జరగడం విశేషం.

Leave a comment

error: Content is protected !!