చిత్రం: ముఖచిత్రం
నటి నటులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విశ్వక్ సేన్ తదితరులు
సంగీతం: కాల భైరవ
ఛాయాగ్రహణం: శ్రీనివాస్
ఎడిటర్: పవన్ కళ్యాణ్
సమర్పణ: ఎస్ కేఎన్
నిర్మాత: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
కథ స్క్రీన్ ప్లే: మాటలు: సందీప్ రాజ్
దర్శకత్వం: గంగాధర్
విడుదల తేదీ: 09-12-22
విశ్వక్ సేన్ ముఖ్య పాత్రలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్ హీరో హీరోయిన్ లు గా నటించిన చిత్రం “ముఖచిత్రం”. కలర్ ఫోటో దర్శకుడు, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా తో గంగాధర్ కొత్త దర్శకుడు గా పరిచయం అవ్వుతుండగా, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మీద చాలా ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. “కాల భైరవ” మ్యూజిక్ మరో ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. ఈ వారం రీలిజ్ అయ్యిన, ముఖచిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: రాజ్‌కుమార్(వికాస్ వశిష్ణ) ప్లాస్టిక్ సర్జరీ చేసే ఒక డాక్టర్. విజయవాడ కి చెందిన మహతి(ప్రియా వడ్లమాని) ఫోటో చూసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కి ముందు రోజు, రాజ్ స్కూల్ ఫ్రెండ్ మాయా(ఆయేషా ఖాన్) ప్రేమించిన విషయం ఎక్సప్రెస్ చేస్తుంది, కానీ ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులు తరువాత మాయ రోడ్డు ప్రమాదంలో ఫెస్ అంత డ్యామేజ్ అవ్వుతుంది. ఆ సమయంలో మహతి బ్లడ్ మ్యాచ్ కావడంతో మాయకి రక్తదానం చేస్తుంది. అప్పటికే, మహతి ప్రెగ్నెట్ అన్న విషయాన్ని చెప్పలేకపోతుంది. ఒక రోజు ఇంట్లో మహతి నీరసంతో కాలు జారీ పై నుంచి కింద పడి చనిపోతుంది. అప్పుడే, రాజ్ ప్లాస్టిక్ సర్జరీ అంటూ, మహతి ఫెస్ తీసి మాయ కి ప్రాణం పోస్తాడు. మాయ ని మహతిగా ఊహించుకొని ఆమెని పెళ్లాడతాడు. మరి, రాజ్‌పై మాయ ఎందుకు కేసు పెట్టింది? మహతి డెత్ నిజంగానే న్యాచురల్ ఏనా? లాయర్ విశ్వక్ సేన్ ఎవ్వరు? మాయ కేస్ వాదించడానికి కారణమేంటి?
కధనం, విశ్లేషణ:
వైవాహిక హత్యచారాన్ని మౌనంగా భరిస్తున్న మహిళ తిరగబడితే ఎలా ఉంటుంది అనేది ఈ ముఖచిత్రం. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కూడ కట్టుకున్న భార్య ని బలవంతం గా సెక్స్ చేస్తే చట్ట రీత్య నేరం అని ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రియుడిపై మోజుతో భర్తని చంపేసి అతని ఫేస్‌ని ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించిన విషయం సంచలనం సృష్టించింది. బహుశా అదే రిఫరెన్స్ గా తీసుకొని ఉంటారు. ఇంట్లో భార్యపై జరిగే వైవాహిక హత్యచారా అంశాలను ఇందులో ఆవిష్కరించన తీరు బాగుంది. పిల్ల జమిందార్, బాగమతి సినిమాలకి పని చేసిన గంగాధర్ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన కొన్ని సన్నీవేశాలు బెడిసి కొట్టాయి. పలు చోట్ల ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ ప్లే, రైటింగ్ విషయంలో సందీప్ రాజ్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటె బాగుండేది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తీసుకెళ్లడం లో బాగానే సక్సెస్ అయ్యారు.
ట్రాయాంగిల్ లవ్ స్టోరీకి, సెక్స్ వల్ అబ్యూజింగ్, ఫేస్ మార్ఫింగ్‌కి అంశాలను ముడిపెట్టిన తీరు బాగుంది. కాకపోతే, కొన్ని చోట్ల ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంటుంది. మొదటి భాగం సాధాసీదాగానే సాగిన, మెస్మరైజింగ్ చేసే అంశాలేవి కనిపించవు. అయితే, సెకండాఫ్‌లో ఇంటరెస్టింగ్ గా అనిపించిన బ్యాలెన్స్ చేయలేకపోయారు. క్లైమాక్స్ సరైన ముగింపు లేదు, విశ్వక్ సేన్ లాయర్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు బాగున్న `వకీల్ సాబ్`లో కోర్ట్ రూమ్ లో ఎమోషన్స్ పండించలేకపొయ్యాడు. అదే విధంగా డ్రామాని రక్తికట్టించడంలో దర్శకుడు విఫలమయ్యారు. అదే క్లైమాక్స్ ని మరింత దృడంగా ప్లాన్ చేసి ఉంటే సినిమా ఫలితం వేరే లెవెల్ లో ఉండేది.
నటి నటులు పెర్ఫామెన్స్: హీరో వికాస్ వశిష్ట యాక్టింగ్ లో బాగానే మెప్పించిన కొన్ని సీన్స్ లో తేలిపోయాడు. ముఖ్య పాత్ర పోషించిన వశిష్ట(విశ్వక్ సేన్) లాయర్ లుక్స్ బాగున్నపెద్దగా ఆకట్టుకోలేకపోయ్యాడు. ప్రియ వడ్లమాని ఈ సినిమాలో ఎక్సట్రార్డినరీ పెర్ఫామెన్స్ తో బాగానే రాణించింది. కాకపోతే, హెవీ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చెయ్యడంతో కొన్ని సీన్స్ పండలేదు. నార్త్ హీరోయిన్ ఆయేషా ఖాన్ కొత్త అమ్మాయి అయ్యిన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రూవ్ చేసుకుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ లో చేసిన చైతన్య రావ్ తన పరిధి మేరకు యాక్టింగ్ రాణించారు. ఇకపోతే ఫైనల్ గా రవి శంకర్ క్లైమాక్స్ పార్టీ కి ప్రాణం పోసాడు.
సాంకేతిక వర్గం: దర్శకుడు గంగాధర్ వైవాహిక హత్యచారాన్ని మౌనంగా భరిస్తున్న మహిళ తిరగబడితే ఎలా ఉంటుంది చూపించిన తీరు బాగుంది. కాకపోతే, స్క్రీన్ ప్లే, రైటింగ్ విషయంలో సందీప్ రాజ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ సినిమాకి ప్రధాన బలం. తనవంతు సినిమాకి ప్రాణం పోసాడు. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్న అక్కడక్కడ విజ్యువల్స్ తేలిపోతాయి. ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ కాస్త కంట్రోల్ చేసినట్టు అర్ధమవ్వుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సో సో గా ఉన్నాయి.
రేటింగ్: 2/5
బాటమ్ లైన్: బోల్తా కొట్టిన “ముఖచిత్రం”
Review By: Tirumalasetty Venkatesh