నటసింహ నందమూరి బాలకృష్ణ నటజీవితంలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముద్దుల మేనల్లుడు. కుటుంబ చిత్రాలు తీయడంలో దిట్ట అయిన కోడి రామకృష్ణ  భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా 1990లో విడుదలైంది.  31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లో కథానాయికగా విజయశాంతి నటించగా..  నాజర్ , బ్రహ్మాజీ, వసంత్ , ప్రసన్నకుమార్, బాలాజీ , కెకె శర్మ, జయంతి, సంగీత, కల్పనారాయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కె.వి.మహదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. రెండు కుటుంబాల మధ్య కలహాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నాజర్ , బాలకృష్ణ ల కుటుంబాలు రెండూ కొన్ని తరాల నుంచీ కక్షలతో కొట్టుకుంటూ ఉంటారు. చివరికి ఆ రెండు కుటుంబాలు ఎలా ఒకటవుతాయి అనే కథాంశంతో ‘ముద్దుల మేనల్లుడు’ తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా రామరాజన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘తంగమాన రాసా చిత్రానికి రీమేక్ వెర్షన్. ఈ సినిమా అప్పట్లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందుకే ఆ సినిమా కథను బాలయ్య ఇమేజ్ కు అనుగుణంగా మార్చి కోడి రామకృష్ణ దాన్ని ‘ముద్దుల మేనల్లుడు’గా మలిచి హిట్టు కొట్టారు.

 

Leave a comment

error: Content is protected !!