Mrunal Thakur : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మృణాల్ ఠాకూర్, తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్‌.జే. బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో మృణాల్ ఒక కీలక పాత్ర పోషించనుంది. ఈ సినిమాతో తమిళ సినిమాల్లో మృణాల్ తొలి అడుగు వేయనుంది.

మృణాల్‌కు తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ‘కంగువా’ సినిమాలో హీరోయిన్‌గా ఆమె పేరు ప్రచారమైంది. అయితే ఆ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు సూర్య మరో సినిమాలో మృణాల్‌కు అవకాశం ఇవ్వడం విశేషం.

ఈ సినిమాలో మృణాల్ ఒక్కతే హీరోయిన్ కాదు. ఇప్పటికే రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మంచి పాత్ర దొరకడంతో మృణాల్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మృణాల్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావచ్చు.

Leave a comment

error: Content is protected !!