Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన దృష్టిని సౌత్ వైపు మళ్లించింది. సీతా రామం , హాయ్ నాన్న వంటి ఆకట్టుకునే చిత్రాలను చేసింది. నటి కూడా అనేక సౌత్ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఇటీవల ఓ బాలీవుడ్ బిగ్గీకి సంతకం చేసింది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2లో మృణాల్ ఠాకూర్ కథానాయిక.

ఈ చిత్రం వారి 2012 లో వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్‌’ కి సీక్వెల్ కాదు . కానీ ఇది కొత్త స్క్రిప్ట్. చిత్రీకరణ స్కాట్లాండ్‌లో ప్రారంభమవుతుంది. మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ సెట్స్ లోకి జాయిన్ అయింది. కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో స్కాట్లాండ్‌లో ప్రారంభమవుతుంది. ఇది 50 రోజుల పాటు కొనసాగుతుంది.

గ్లెన్‌కో, గ్లెన్‌ఫిన్నన్, కుల్‌రోస్ ప్యాలెస్, డౌన్ కాజిల్, ప్రెస్టన్ మిల్ ఇంకా ఫాక్‌ల్యాండ్ ప్యాలెస్‌లలో ఈ చిత్రం ప్రధాన భాగాలను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఉన్నాడు. విజయ్ కుమార్ అరోరా ఈ చిత్రానికి దర్శకుడు . అజయ్ దేవగన్ ప్రస్తుతం సింగం ఎగైన్ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రం దీపావళి సీజన్‌లో విడుదల కాబోతోంది. .

Leave a comment

error: Content is protected !!