అక్కినేని వారి నట వారసుడు అఖిల్ .. ఇప్పటి వరకూ ముచ్చటగా మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే మనోడి బ్యాడ్ లక్కో ఏంటో గానీ.. ఆ మూడు సినిమాలూ .. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు వరుసగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. అందరి హీరోల్లాగానే తానూ సక్సెస్ ఫుల్ చిత్రాలతో టాలీవుడ్ లో నిలబడాలని తపించిన ఆ హీరోకి విజయం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అయితే ఇప్పుడో విషయంలో మాత్రం మనోడు వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి ఎర్లియర్ మూవీ మిస్టర్ మజ్ను చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించి .. అందరికీ షాకిచ్చింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ అఖిల్ చిత్రం స్ట్రైట్ గా టాలీవుడ్ లో పరాజాయం పాలైనా.. యూ ట్యూబ్ లో విడుదలైన డబ్బింగ్ వెర్షన్ మాత్రం రికార్డు క్రియేట్ చేయడం హాట్ టాపిక్ అయింది. మిస్టర్ మజ్ను డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో విడుదలైన 40 గంటల్లో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ ను సాధించి షాకిచ్చింది. అలాగే 600 లైక్స్ సాధించింది కూడా. కొంతకాలంగా మన తెలుగు చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ కు యూ ట్యూబ్ లో విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఈ రకంగానైనా అఖిల్ సినిమా సక్సెస్ అయినందుకు అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!