Mr. Bachan : రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్. అజయ్ దేవ్ గణ్ నటించిన ‘రైడ్’ బాలీవుడ్ మూవీకిది అఫీషియల్ రీమేక్. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను ఆగస్టు 15న విడుదల చేయ బోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రవితేజ స్టైలిష్ లుక్‌ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. మాస్ యాక్షన్‌కు మంచి పేరు తెచ్చుకున్న రవితేజ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఒక ఐటీ అధికారి పాత్రలో రవితేజ యాక్షన్‌కు మంచి పేరు వస్తుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. మిక్కీ జె.మేయర్ సంగీతం, అయనంక బోస్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అందించారు. ఇంక ఈ సినిమా ఆగస్టు 14న ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!