Mr. bachan : మిస్టర్ బచ్చన్ షూటింగ్ ఫార్మాలిటీస్ ముగిశాయి. ఇది రవితేజ అండ్ హరీష్ శంకర్‌ కలయిక లోని మూడవ సినిమా. ఈ సినిమా షోరీల్‌ను వినూత్న పద్ధతిలో విడుదల చేయడానికి బృందం ప్లాన్ చేస్తోంది. దీన్ని ఎలాంటి డైలాగ్స్ లేకుండా గ్లింప్స్‌ గా కట్ చేసి వదులుతున్నారు. జూన్ 17న షోరీల్ రాబోతోందని ఇదొక క్రాకర్ అని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో తెలిపాడు.

మిస్టర్ బచ్చన్‌ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ రైడ్‌కి రీమేక్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం మరియు నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!