Mr. Bachan movie : మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో , టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది . మిగిలిన భాగం చిత్రీకరణ కశ్మీర్ లోయలో జరుగుతోంది.

తాజాగా.. రవితేజ, భాగ్యశ్రీలపై ఒక అందమైన మెలోడీ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు అందించారు. “మిస్టర్ బచ్చన్” స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం, అయనంక బోస్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అందించారు. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు మేకర్స్. రవితేజ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో మరో విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు.

Leave a comment

error: Content is protected !!