Mr. Bachan : మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రెయిడ్’కు రీమేక్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందాల భామ భాగ్యశ్రీ బొర్సె ఈ చిత్రంలో రవితేజకు జోడిగా నటిస్తుండగా, విలక్షణ నటుడు జగపతి బాబు విలన్‌గా కనిపిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా ఆనందించేలా చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం 2 గంటల 38 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందే ఉండటంతో సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా మిస్టర్ బచ్చన్ వస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ఈ సినిమాపై భారీగా ఆసక్తి చూపుతున్నారు.

Leave a comment

error: Content is protected !!