చిత్రం : మోసగాళ్ళు

నటీనటులు : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ కిచ్లు, సునీల్ శెట్టి, రుహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర, రవివర్మ, మహిమ మక్వాన, రవి ప్రకాష్, తనికెళ్ళ భరణి, తులసి, నాగినీడు, రాజా రవీంద్ర, రఘుబాబు, వైవ హర్ష తదితరులు

సంగీతం : శ్యామ్ సీఎస్

ఎడిటింగ్ : గౌతం రాజు

సినిమాటోగ్రఫీ : షెల్డన్‌ చావ్‌

బ్యానర్ : ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ

నిర్మాత : మంచు విష్ణు

కథ : మంచు విష్ణు

దర్శకత్వం : జెఫ్రీ గి చిన్

విడుదల : 19-03-2021

కథ

అను(కాజల్‌), అర్జున్‌(మంచు విష్ణు) కవల అక్కా తముళ్లు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (త‌నికెళ్ల భ‌ర‌ణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని ఫీలవుతుంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. విజ‌య్ (న‌వ‌దీప్‌)తో క‌లిసి ఒక‌ ఫేక్‌ కాల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్‌ వేస్తారు. ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్  పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి  ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. అలా ఓ భారీ మోసానికి పాల్పడుతారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్‌, భార‌త ప్ర‌భుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్‌ (సునీల్ శెట్టి) సహాయం అడుగుతుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్‌ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు? వాళ్ళు స్కాం చేసిన డబ్బు ఏమైంది? అనేదే మిగతా కథ.

కథనం

హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై  ఎలా థ్రిల్లింగ్‌ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అర్జున్ ఓ కాల్ సెంటర్‌లో ప‌నిచేయ‌డం.. దాని ద్వారా అక్ర‌మంగా అమెరిక‌న్ల డేటాను సేక‌రించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్‌ వేయడం.. ఇలా కథని తెరపై చూపించిన విధానంలో ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేసే అంశాలు కానీ సన్నివేశాలు కానీ ఎక్కడ కనిపించవు. ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : చాలా గ్యాప్ తర్వాత్ తెరపై కనిపించిన మంచు విష్ణు క‌థ‌కి త‌గ్గ‌ట్లుగా అర్జున్ పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. తనకు అక్కగా నటించిన కాజల్ అగర్వాల్  క‌న్నింగ్ మెంటాల్టీతో ఆద్యంతం సీరియ‌స్ లుక్‌ లో కనిపిస్తుంది. డీఎస్పీ కుమార్‌గా సునీల్ శెట్టికి తన పాత్ర వరకు న్యాయం చేయగలిగారు. ఐతే  ఆయ‌నలోని న‌టుడికి స‌వాల్ విసిరే ఒక్క సీన్ కూడా సినిమాలో లేవు…అను పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపించిన విధానం బాగుంది. ఆ పాత్ర‌ని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దాల్సింది. ఇక న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్‌, వైవా హ‌ర్ష పాత్ర‌లు ప‌రిధి మేర ఆకట్టుకుంటాయి. శ్యామ్ సీఎస్ నేప‌థ్య సంగీతం చిత్రానికి అనుగుణంగా ఉంది. ఈ చిత్రం కోసం ఎంచుకున్న క‌థ బాగున్నా.. దాన్ని తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ముఖ్యంగా సినిమాలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే మ‌లుపులు.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎపిసోడ్లు ఏ స్థాయిలో కూడా కనిపించవు…ఉండి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది.  నిర్మాణ విలువలు బాగున్నాయి…

బోటమ్ లైన్ : మోసగాళ్ళు కథ ఓకే కానీ తీసిన విధానమే ..నాట్ ఓకే

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

రేటింగ్ : 2/5

Leave a comment

error: Content is protected !!