Shopping Cart 0 items - $0.00 0

మూడుముళ్ళు

హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్టోరియల్ వెంచర్స్ లో అద్భుతమైన ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్  చిత్రం ‘మూడుముళ్ళు’. చంద్రమోహన్, రాధిక జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. 1983 లో విడుదలైన ఈ  చిత్రం  ఏవియమ్,  సారధి స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రూపొందింది.  ఒక బిడ్డను కని ప్రసవంలో కన్నుమూసిన భార్య జ్నాపకాలతో ఆ బిడ్డకు అన్నీ తనై సాకుతుంటాడు ఒక టీచర్. ఒక గ్రామానికి కొత్త గా వచ్చిన ఆ టీచర్ కు, అతడి బిడ్డకు బాగా దగ్గరవుతుంది ఒక అమ్మాయి. చివరికి ఆ టీచర్ ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడా లేదా అన్నే మిగతా కథ. గీత, రాజ్యలక్ష్మి, కాంతారావు, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, నళినీ కాంత్, జానకి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ‘ముందానై ముడిచ్చు’ చిత్రానికి రీమేక్ వెర్షన్.  కె.భాగ్యరాజ్, ఊర్వశి జంటగా నటించిన ఈ సినిమాకి భాగ్యరాజే దర్శకుడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించగా.. ‘మూడుముళ్ళు’ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. నీకోసం యవ్వనమంతా, జోజోలాలీ కన్నా లాలిజో, లేత చిరుగాలిలో లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

 

Leave a comment

error: Content is protected !!