ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ల పాత్రలకు హిందీ నటులు ఎక్కువగా కనిపించేవారు. కానీ కాలక్రమేణా తెలుగు హీరోలు – శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వారు విలన్లుగా మారడంతో ఈ ట్రెండ్ మారింది. ఆ తర్వాత మలయాళ నటులు తెలుగు సినిమాల్లో విలన్లుగా రాణించడం ప్రారంభించారు. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపీ లాంటి నటులు మొదట తెలుగులో అనువాద సినిమాల ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారు నేరుగా తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించారు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహాద్ ఫాసిల్, జోజు జార్జ్, షైన్ టామ్ చాకో వంటి మలయాళ నటులు తెలుగులో విలన్లుగా రాణిస్తున్నారు. పృథ్వీరాజ్ “సలార్” సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఫహాద్ ఫాసిల్ “పుష్ప” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. “పుష్ప 2” లో కూడా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో “దసరా”, “రంగబలి” సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ – బాబీ సినిమాతో పాటు “సలార్ 2” లో కూడా నటిస్తున్నాడు. ఈ నటుల విజయంతో మరింత మంది మలయాళ నటులు తెలుగు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!