Mohanlal : మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ .. మోహన్‌లాల్‌ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘హృదయపూర్వం’ అనే చిత్రాన్ని ప్రకటించి, సత్యన్‌ అంతిక్కడ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆంటోనీ పెరుంబవూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ కామన్ మేన్ గా కనిపించనున్నారు.  దర్శకుడి కుమారుడు అనూప్‌ సత్యన్ ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు.

“మోహన్‌లాల్‌-సత్యన్‌ల మరో సూపర్‌ ఫన్‌ ప్రాజెక్టు ముస్తాబు కానుంది. ఇది వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో పాటు, ఆయన దర్శకనిర్మాతలతో మోహన్‌లాల్‌ కలిసి ఉన్న ఫొటోని కూడా పంచుకున్నారు. మోహన్‌లాల్‌-సత్యన్‌ కలయికలో గతంలో వచ్చిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ కొత్త చిత్రం కూడా అదే బాటలో సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Leave a comment

error: Content is protected !!